‘మ్యాడ్‘ మరో ‘హ్యాపీడేస్‘ అవుతోందా

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మ్యాడ్‘. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఒకవైపు అగ్ర కథానాయకులతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ.. మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కి పెద్ద పీట వేస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సితారతో కలిసి ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ కుమార్తె హారిక నిర్మాతగా పరిచయమవుతోంది. అక్టోబర్ 6న విడుదలకు ముస్తాబైన ‘మ్యాడ్‘ మూవీ నుంచి ట్రైలర్ రిలీజయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మ్యాడ్‘ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

‘మ్యాడ్‘ ట్రైలర్ యూత్ ఫుల్ ఫన్ రైడ్ గా ఉంది. కాలేజీ వాతావరణం, అక్కడ గొడ‌వ‌లు, స‌ర‌దాలు, ల‌వ్ స్టోరీస్‌ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ‘హ్యాపీడేస్‘. పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘హ్యాపీడేస్‘ సినిమా అప్పట్లో యూత్ ని ఓ ఊపు ఊపేసింది. మళ్లీ అలాంటి ఫ్లేవర్ తో ఫుల్ లెన్త్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అలరించడానికి సిద్ధమవుతోంది ‘మ్యాడ్‘.

Related Posts