రామ్ చరణ్‌ 15పై లేటెస్ట్ అప్డేట్

రామ్ చరణ్‌ 15.. ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఓ దశలో ప్రొడక్షన్ హౌస్ పైనా, దిల్ రాజుపైనా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు కూడా. అయినా ఆ వైపు నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. రాలేదు.

మామూలుగా దిల్ రాజు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగానే ఉంటాడు. ఈ సారి కుదర్లేదో లేక.. ఇంకేదైనా రీజన్ ఉందో కానీ.. ఆర్.సి 15అనే అప్డేట్ అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం అలా ఉండిపోతోందంతే. ఇక ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ కొత్త అప్డేట్ వచ్చింది.


ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడుగా ఉన్న శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్‌ నటిస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. నిజానికి శంకర్ తో సినిమా చేయాలన్నది చిరంజీవి కల. అది సాధ్యం కాలేదు. కానీ ఆయన కొడుకుతో కుదిరింది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ మూవీ తర్వాత రాబోతోన్న సినిమా కావడం, శంకర్ కు ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ ఇమేజ్ ఉండటంతో ఈ మూవీపై ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా తెలియని క్రేజ్ వచ్చేసింది.

అందుకు తగ్గట్టుగా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. కియారా అద్వానీ హీరోయిన్ గా అంజలి, ఎస్జే సూర్య, సునిల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాం ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ఇది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎలా చూసినా ఓ క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన ఈ మూవీ షూటింగ్ ను ఆపేసి, శంకర్.. భారతీయుడు2 పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే ఆ మూవీ ఆలస్యం అవుతోంది.

అయినా అప్పుడప్పుడూ ఓ షెడ్యూల్ చేస్తా అని చెప్పాడు శంకర్. అదీ లేకపోయే సరికి అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మరీ లేట్ చేస్తే అసలుకే మోసం �