కుమారి శ్రీమతి ట్రైలర్ ఎలా ఉంది

నిత్య మీనన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కుమారి శ్రీమతి’. ఎర్లీ మాన్ సూన్ టేల్స్ బ్యానర్ తో కలిసి స్వప్న సినిమా బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. గోమ్టే ఉపాధ్యే దర్శకుడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తోనే మంచి ఇంప్రెషన్ వేశారు. సింగిల్ గా ఉంటూ పెళ్లంటే ఇష్టంలేని అమ్మాయి పాత్ర అనిపించింది. తాజాగా నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో తనుఎందుకు పెళ్లికి దూరంగా ఉంది అనే విషయం చెప్పారు.


తాతల కాలం నాటి ఇళ్లు. బాబాయ్ తో గొడవ వల్ల కోర్ట్ లో కేస్ అవుతుంది. తండ్రి లేకపోయినా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలనే కలతో ఉంటుంది ఇంకా పెళ్లి కాని కుమారి ఇటికలపూడి శ్రీమతి అనే అమ్మాయి. తల్లి ఎన్ని సంబంధాలు తెచ్చినా.. ఆ ఇంటి తర్వాతే పెళ్లి అని భీష్మించుకుంటుంది. ఇద్దరిలో ఎవరైనా ఆ ఇంటిని కొనడం ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చు అని కోర్ట్ తీర్పు ఇస్తుంది. అందుకు 37లక్షలు చెల్లించాలి. కేవలం 13వేల జీతంతో పనిచేసే శ్రీమతి ఆ డబ్బుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ చివరికి ఓ బార్ పెట్టాలని ఆలోచించి పెడుతుంది కూడా. మరి ఆ బార్ తో వచ్చిన డబ్బులతో తను ఇళ్లు సొంతం చేసుకుందాం.. తనంటే పడి చచ్చే తనకంటే చిన్నవాడైన మామ కొడుకు, మరో ఫ్రెండ్ లో ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది మిగతా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యేప్పుడు చూడాల్సిన విషయం. అన్నట్టు ఇది థియేట్రికల్ మూవీ కాదు. ఓటిటి బొమ్మ. ఈ 28నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోంది.


ఇక నిత్య మీనన్ తో పాటు గౌతమి, తిరువీర్, నిరుపమ్, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related Posts