దర్శకుడిని మరో మెట్టు పైకెక్కించిన ‘కోట బొమ్మాళి పీఎస్’..

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ వచ్చి స్టార్స్ హీరోలను డైరెక్ట్ చేస్తూ అగ్ర దర్శకుల జాబితాలో చేరుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ‘కోట బొమ్మాళి’ చిత్ర దర్శకుడు తేజ మార్ని నిలుస్తాడని ఇండస్ట్రీ ప్రముఖులు చెప్పుకుంటున్నారు. ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్‌ని ఎంకరేజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థలను ప్రశంసిస్తున్నారు. ఈరోజు విడుదలైన ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ కి ప్రేక్షకుల నుంచి పూర్తిగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినీ విశ్లేషకులు సూపర్ హిట్ అని చెబుతున్నారు.

దాంతో ఈ చిత్ర దర్శకుడు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే, ఇతర భాషల నుంచి తెలుగులో రీమేక్ చేసిన ఎన్నో సినిమాలు ఇక్కడ హిట్ సాధించాయి. అయితే, ఒరిజినల్ కథను ఢీల్ చేసే విధానం బాగా తెలిసి ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు తేజ మార్ని నూటికి నూరు శాతం విజయం సాధించాడు. కేవలం ఒరిజినల్ కంటెంట్ లో ఉన్న సోల్ మాత్రమే తీసుకొని, దాన్ని మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తీసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రంతో శ్రీకాంత్ కి హిట్ ఇచ్చాడు దర్శకుడు తేజ మార్ని. గతంలో తీసిన ‘జోహార్’, ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాలతో తన టాలెంట్ చూపించిన తేజ మార్ని ‘కోట బొమ్మాళి పీఎస్’ సక్సెస్ తో మరో మెట్టు పైకెక్కాడు.

Related Posts