‘కల్కి‘ ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి‘ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్లింప్సెస్ తో పాటు.. ట్రైలర్ కూడా ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అందించింది. ఇక.. ఇప్పుడు పాటల వంతొచ్చింది. ‘కల్కి‘ నుంచి ఫస్ట్ సింగిల్ ‘భైరవ ఏంథెమ్‘ ప్రోమో వచ్చేసంది.

సంతోష్ నారాయణన్ సంగీతంలో బాలీవుడ్ పాపులర్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఈ గీతాన్ని ఆలపించాడు. ఇక.. ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ప్రభాస్, ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ సింగర్ దిల్జీత్ కలిసి ఈ పాటలో సందడి చేశారు. అందుకే.. ఈ పాటకు ఇండియాస్ బిగ్గెస్ట్ సాంగ్ గా నామకరణం చేసింది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. లేటెస్ట్ గా ఈ సాంగ్ ప్రోమో రిలీజైంది. ఫుల్ వీడియో సాంగ్ రేపు విడుదల కానుంది.

Related Posts