ఓవర్సీస్ లో కలెక్షన్లు కుమ్మేస్తోన్న ‘కల్కి’

తెలుగు సినిమాలకు.. గతంలో ఆంధ్రా, సీడెడ్, నైజాం, కర్ణాటకలే మెయిన్ ఏరియాస్. ఆ తర్వాత ‘బాహుబలి’తో పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ అనువాద రూపంలో తెలుగు సినిమాలు అదరగొడుతున్నాయి. ఇక.. పాన్ ఇండియా ట్రెండ్ రాకమునుపే టాలీవుడ్ కి మరో పెద్ద మార్కెట్ గా అవతరించింది ఓవర్సీస్.

ఓవర్సీస్.. తెలుగు సినిమాలకు అతిపెద్ద మార్కెట్. కరోనా తర్వాత కాస్త కుదేలైన ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మళ్లీ ఓవర్సీస్ లో భారీ సత్తా చాటిన చిత్రంగా ‘కల్కి’ నిలవబోతుంది. అక్కడ ప్రి టికెట్ సేల్స్ రూపంలో 3 మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టిన ‘కల్కి’.. లేటెస్ట్ గా 7 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే.. మన రూపాయల్లో దాదాపు రూ.60 కోట్లు. ఈ ఫిగర్ వీకెండ్ కు మరింత పెరిగే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో ‘కల్కి’ ఓవర్సీస్ మార్కెట్ లో సరికొత్త రికార్డులు కొల్లగొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Posts