జూన్ 7కి షిప్టైన కాజల్ ‘సత్యభామ’

మే 31న మొదటిగా అరడజనుకు పైగా సినిమాలు విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. వీటిలో.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హరోం హరం, సత్యభామ, భజే వాయు వేగం, గం గం గణేశా’ వంటి చిత్రాలున్నాయి. అయితే.. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సుధీర్ బాబు ‘హరోం హర’ జూన్ 14కి షిప్టయ్యింది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ’ జూన్ 7కి మారింది.

సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ’. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ‘సత్యభామ’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు. ట్రైలర్ లాంఛ్ కు ముఖ్య అతిథిగా నటసింహం బాలకృష్ణ రాబోతున్నాడు.

Related Posts