కాజల్ కు దెయ్యాల గొడవేంటో

కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ గట్టిగానే ప్లాన్ చేసుకుంటోంది. వరుసగా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. అయినా తను మాత్రం సెలెక్టివ్ గానే వెళుతోంది. తన గత ఇమేజ్ కనిపించకుండా.. కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా అర్థం అవుతోంది. ప్రస్తుతం తెలుగులో భగవంత్ కేసరితో పాటు సత్యభామ అనే సినిమాలు చేస్తోంది.

సత్యభామలో ఫస్ట్ టైమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. భగవంత్ కేసరిలోనూ హుందా అయిన పాత్రే అని మొన్న ఫస్ట్ లుక్ తో అర్థం అయింది. అయితే వీటితో పాటు కొత్తగా దెయ్యాల వెంట కూడా పరుగులు పెడుతోంది కాజల్ అగర్వాల్.


పెళ్లికి ముందే కమిట్ అయిన హారర్ మూవీ ‘ఘోస్టీ’ ఈ మార్చిలో విడుదలైంది. తమిళ్ లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేశారు. బట్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇదో కామెడీ హారర్ మూవీ. ఇందులోనూ కాజల్ పోలీస్ గా నటించడం విశేషం.

ఇక ఇప్పుడు మరోసారి హారర్ బ్యాక్ డ్రాప్ మూవీతో వస్తోందీ చందమామ. కాజల్ కార్తీక అనే టైటిల్ తో మరో హారర్ మూవీతో వస్తోంది కాజల్. దీక్యా అనే తమిళ్ డైరెక్టర్ రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ కాజల్ కార్తీక అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో కాజల్ డైరెక్ట్ గా దెయ్యాలతో పెట్టుకోవడం లేదు కానీ సినిమా మాత్రం హారరే.

కాజల్ తో పాటు రెజీనా కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది. మరి కాజల్ దెయ్యాల గొడవలతో తెలుగువాళ్లు కనెక్ట్ కావడం కష్టమే అని ఈ మూవీ టీజర్ చూస్తేనే తెలుస్తుంది. అయినా ఈ తెలుగు ఆడియన్స్ పై ఈ హాంటింగ్ ఏంటో..?