నిఖిల్ తో మళ్లీ సమస్యేనా..?

నిఖిల్ ఓ సినిమా చేస్తున్నాడంటే దానిపైనే కాన్ సెంట్రేట్ చేస్తాడు. ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రమోషన్స్ వరకూ ముందుంటాడు. అన్నీ తానే అయ్యి నడిపించాలనుకుంటాడు. కొంత వరకూ ఇది మంచిదే అయితే.. ఆ మంచి పెరిగినా మంచిది కాదు అనే టాక్ కూడా ఉంది. ముఖ్యంగా సినిమాల రిలీజ్ టైమ్ లో నిఖిల్ చేసే హడావిడీ నిర్మాతలకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రమోషన్స్ కోసం తనే స్వయంగా అన్ని మీడియా సంస్థలకు ఫోన్ చేస్తాడు. ఎక్కడికి పిలిచినా వెళతాడు. అయితే ఒక్కోసారి రిలీజ్ టైమ్స్ లోనే నిర్మాతలను ఇబ్బంది పెడతాడు అనే ప్రచారం ఉంది. రిలీజ్ తన ప్లాన్ ప్రకారం చేయాలని కండీషన్స్ పెడతాడట. ఇప్పుడు కూడా స్పై మూవీ విషయంలో ఇదే జరుగుతోందని చెబుతున్నారు.


స్పై చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు. ఈ మేరకు వారికి బిజినెస్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని భావించారు. మరోవైపు ఆ డేట్ కు విడుదల చేస్తేనే అన్నట్టుగా అమెజాన్ ప్రైమ్ వాళ్లు భారీ స్థాయిలో ఈ మూవీ రైట్స్ తీసుకున్నారు. అంటే ఖచ్చితంగా 28న విడుదలైతే ఆ తర్వాత తమ ఓటిటిలో స్ట్రీమ్ చేసుకునే వీలు చూసుకునే వాళ్లు ఆ కండీషన్ పెట్టి ఉంటారు. అందుకే నిర్మాతలు అలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ ప్లాన్ నిఖిల్ కు ఇష్టం లేదట. ఈ నెల 28న విడుదల చేయొద్దు అని నిర్మాతలకు చెప్పాడని టాక్.

బట్ వాళ్లు బిజినెస్ యాంగిల్ లో రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో అంటీముట్టనట్టుగా ఉండాలనుకుంటున్నాడట నిఖిల్. అందుకే లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదలైనా కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్టూ పెట్టలేదు నిఖిల్. ఏదేమైనా సినిమా బాగా వచ్చిందన్న నమ్మకం ఉన్నప్పుడు ఎప్పుడు విడుదలైనా హిట్ అవుతుందని ఈ మధ్య మారిన ట్రెండ్ నిరూపిస్తుంది. అన్ని ముహూర్తాలూ చూసుకుని వచ్చిన సినిమాలుకంటెంట్ లేక నెక్ట్స్ సోకే టపా కట్టాయి. నిర్మాతల మేలు కోరితే ఏ హీరో కూడా ఇలా చేయడు అంటూ ఇన్ డైరెక్ట్ గా నిఖిల్ పై సెటైర్స్ వేస్తున్నారు కొందరు.

Related Posts