పూరీ నిర్ణయం సరైందేనా..?

పూజీ జగన్నాథ్.. ఒకప్పుడు టాప్ డైరెక్టర్. ఇప్పుడు ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు. ముఖ్యంగా టెంపర్ .. ఇస్మార్ట్ శంకర్ మధ్యలో అనేక ఫ్లాపులు చూశాడు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే లైగర్ తో ఆల్ టైమ్ డిజాస్టర్ చూశాడు.

దీంతో ఏ హీరో కూడా పూరీ డేట్స్ సంగతి పక్కన బెడితే ముందు కథ వినేందుకు టైమ్ కూడా ఇవ్వలేదు. ఈ కారణంగా 11 నెలలు ఆగాల్సి వచ్చింది. ఇంత గ్యాప్ తర్వాత మరోసారి రామ్ హీరోగానే ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ మొదలుపెట్టాడు.

డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ మార్పు చేశాడు పూరీ జగన్నాథ్.


ఇస్మార్ట్ శంకర్ విజయంలో అత్యంత కీలక పాత్ర సంగీతానిది అంటే అతిశయోక్తి కాదు. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలించింది. రామ్ ఆ రేంజ్ లో డ్యాన్సులు వేశాడంటే మణి మ్యూజిక్కే కారణం. నేపథ్య సంగీతం కూడా అదిరిపోతుంది. మణిశర్మ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలన్నీ ఆల్బమ్స్ పరంగా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి.

అలాంటి మణిశర్మను ఈ సారి తీసుకోవడం లేదు పూరీ జగన్నాథ్. మణి రీసెంట్ గా ఆచార్యతో డిజాస్టర్ ఇచ్చాడు. కానీ మంచి కథ ఉంటే ఏ సంగీత దర్శకుడైనా ఆ జోష్ ను డబుల్ చేయాలనుకుంటాడు. ఆచార్య లాంటి నీరసం సినిమాకు ఎవరూ ఏం చేయలేరు.

మరి మణిశర్మ స్థానంలో ఎవరొస్తారో కానీ.. ఇస్మార్ట్ శంకర్ విజయంలో కీలకంగా ఉన్న ఆయన్ని తప్పించడం ఎంత వరకు కరెక్ట్..? అంటూ ఆడియన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.