పవన్ కళ్యాణ్‌ కు జాతక దోషాలా.. ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాలతోనే కాదు యాగాలతో కూడా బిజీగా మారాడు. పవన్ లో దైవభక్తి ఉందని అందరికీ తెలుసు. కానీ మరీ ఈ రేంజ్ లో వరుసగా యాగాలు చేయించడం.. తను పాల్గొనడం వంటివి ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. పొలిటికల్ గా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు కానీ త్వరలోనే తన వారాహిని బయటకు తీస్తాడు అని చెబుతూ వస్తున్నారు.

అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఈ లోగా మంచి ముహూర్తం చూసుకుని యాగాలు చేయిస్తున్నాడు పవన్. కొన్నాళ్ల క్రితం కేసీఆర్ కూడా తను అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో యాగాలు నిర్వహించాడు. అవన్నీ తన సొంత డబ్బులతో చేయించుకున్నానని చెప్పుకున్నాడు. అది అధికారంలోకి వచ్చినందుకా.. లేక అధికారం చేజారి పోకుండానా అంటూ ఎవరికి వారు చెప్పుకున్నారు. ఇప్పుడు వపన్ కళ్యాణ్‌ చేయిస్తున్న యాగాలు కూడా అధికారం కోసం అనేలా ఉన్నాయంటే అతిశయోక్తేముందీ..?


విశేషం ఏంటంటే.. ఈ మధ్య సినిమా సెట్స్ లో కూడా ఈ తరహా యాగాలు నిర్వహిస్తున్నాడట పవన్ కళ్యాణ్‌. ఆ వ్యవహారం బటయకు రాలేదు కానీ ఇది మాత్రం బయటకు వచ్చింది. మామూలుగా యాగాలు సొంత ఇళ్లల్లోనే చేయించుకుంటారు. పవన్ కూడా అదే చేసినట్టున్నాడు. కాకపోతే అది ఫామ్ హౌస్ లా ఉంది. యాగశాల సెట్ కూడా బావుంది. పవన్ పూర్తిగా ఆ డ్రెస్ కోడ్ లోనే ఉన్నాడు. ఇదంతా చూస్తోంటే.. ఖచ్చితంగా తన జాతకంలో ఏవో లోపాలున్నట్టుగా భావిస్తున్నారు చాలామంది.

ఆ కారణంగానే ఇటుకుటుంబంతో పాటు రాజకీయాల్లో కూడా పెద్దగా సక్సెస్ కావడం లేదు అనే కారణంతో ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఇవన్నీ చేయిస్తున్నాడేమో అనుకుంటున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ యాగానికి సంబంధించిన క్రతువులో ఎక్కడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించలేదు. మామూలుగా ఆయన లేకుండా.. ఆయన సలహా లేకుండా ఇవన్నీ జరగవు కదా అనే డౌట్ కూడా వెలిబుచ్చుతున్నారు కొందరు. ఏదేమైనా పవన్ కళ్యాణ్‌ యాగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.