‘విశ్వంభర‘లో ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అదుర్స్..!

గత ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య‘తో ఘన విజయాన్ని సాధించిన మెగాస్టార్ చిరంజీవికి.. ద్వితియార్థంలో వచ్చిన ‘భోళా శంకర్‘ భారీ డిజాస్టర్ ను మిగిల్చింది. ఈనేపథ్యంలో.. మెగాస్టార్ తన ఫుల్ కాన్సెంట్రేషన్ ‘విశ్వంభర‘ చిత్రంపైనే పెట్టాడు. అలాగే.. ‘విశ్వంభర‘ను సమ్ థింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దించేందుకు డైరెక్టర్ వశిష్ట కూడా ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడట.

‘విశ్వంభర‘ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి‘ తర్వాత చిరంజీవి నటిస్తున్న అలాంటి జోనర్ మూవీ ఇది. ఈ చిత్రంలో ఏకంగా పదమూడుకు పైగా పెద్ద సెట్స్ నిర్మాణం జరిగిందట. అలాగే.. వివిధ లోకాలకు సంబంధించిన కథ కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ లో మేజర్ పార్ట్ సెట్స్, వి.ఎఫ్.ఎక్స్ కే అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

యు.వి.క్రియేషన్స్ ఎంతో ప్రెస్టేజియస్ గా ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది. ఇక.. గత 26 రోజులుగా ‘విశ్వంభర‘కి సంబంధించి భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగింది. ఈరోజుతో ఆ షూట్ పూర్తయ్యిందట. ‘విశ్వంభర‘ చిత్రానికే ఎంతో హైలైట్ గా ఆ యాక్షన్ ఎపిసోడ్ ను తీర్చిదిద్దారట. ఈ ఫైట్ కోసమే 54 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారట. ఆమధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలుసుకున్నది ఆ ప్లేసులోనే. మొత్తంమీద.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘విశ్వంభర‘ మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి విజువల్ ట్రీట్ అందిస్తుందో చూడాలి.

Related Posts