ఒకప్పుడు బాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేసినా అక్కడ అమ్మడికి స్టార్డమ్ రాలేదు అనేది నిజం. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండేది. అలాంటి తనకు తెలుగులో వచ్చిన ఆఫర్ ఒక్కసారిగా కెరీర్ ను కొత్త మలుపు తిప్పింది.
సీతారామం సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించింది. ప్రిన్సెసె నూర్జహాన్ పాత్రలో అదరగొట్టింది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. బట్ తను మాత్రం సెలెక్టివ్ గా వెళుతోంది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్నతో పాటు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తోంది. కోలీవుడ్ లోనూ రీసెంట్ గా ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఇక ఈ సినిమాలకు అమ్మడి రెమ్యూనరేషన్ కూడా చుక్కల్లో ఉండటం విశేషం.
ఇప్పటి వరకూ తెలుగులో ఏ హీరోయిన్ డిమాండ్ చేయనంతగా ఒక్కో సినిమాకు రెండున్నర నుంచి మూడు కోట్ల వరకూ తీసుకుంటోంది. ఇది చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది కూడా. అంటే తను నటనతో పాటు గ్లామర్ విషయంలోనూ ఏ హద్దులూ పెట్టుకోదు కాబట్టే అంత డిమాండ్ అనుకోవడానికి లేదు. హాయ్ నాన్నలోనూ కాస్త పద్ధతిగానే కనిపిస్తోంది. విజయ్ సినిమాలోనూ ఎక్స్ పోజింగ్ తక్కువగానే ఉంటుందంటున్నారు. అయినా ఇంత డిమాండ్ ఉందంటే కారణం సీతారామం సినిమానే అనేది సందేహమే లేని మాట.
ఇక లేటెస్ట్ గా మృణాల్ ఠాకూర్ ను రవితేజ సినిమా కోసం ప్రయత్నిస్తున్నారట. మాస్ రాజా ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. టైగర్ నాగేశ్వరరావు దసరాకు వస్తుంది. ఈగల్ సంక్రాంతికి విడుదలవుతుంది. ఆ తర్వాత వరుసగా సితార, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సినిమాలున్నాయి. మరి వీరిలో ఎవరి సినిమా ముందు చేస్తాడో కానీ.. రవితేజ సరసన మృణాల్ ను తీసుకోవాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.
మాస్ రాజాతో ఆఫర్ అంటే ఆనందంగా ఎగిరి గంతేసే టైప్ కాదు ఆమె. తన చెక్ కు లోటు లేకుండా ఉంటేనే ఓకే అంటుంది. మరి ఆ చెక్ ఎవరు పే చేస్తే వారికే డేట్స్ అంటుందేమో కానీ.. ఆల్మోస్ట్ రవితేజ సరసన నటించే అవకాశాలున్నాయని టాక్. ఏదేమైనా ఒక్క సినిమాకే ఈవిడకు ఇంత డిమాండ్ రావడం విశేషమే.