ఉపాసన అత్తమ్మ కిచెన్‌లో – అమ్మకోసం చెర్రీ వంట

మెగా కోడలు ఉపాసన అత్తమ కిచెన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోస్‌ చాలా క్యూట్ గా నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారనే విషయం తెలుసుకోవాలని జనాలకు చాలా ఆసక్తి ఉంటుంది. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ వీడియోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఉమెన్స్‌డే సందర్భంగా ఉపాసన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.


అత్తమ్మ ఈరోజు కిచెన్‌లో ఏమవుతుంది అని మెగా కోడలు క్యూట్ గా అడిగితే.. ఏమౌతుంది దోశ అవుతుంది అంటూ అత్తమ్మ సురేఖ గారు ఆప్యాయంగా చెప్తారు. పక్కన గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్ వంట చేస్తుంటాడు. రామ్‌చరణ్ గారు ఏం చేస్తున్నారు అని అడిగితే.. మా అమ్మ కోసం మా అమ్మకోసం పన్నీర్ టిక్కా వండుతున్నానని చెప్తాడు. ఉమెన్స్ డే సందర్భంగా ఇంట్లో మగవారు ఇంట్లో మహిళలకోసం వంట చేస్తున్నారనడం అందర్నీ ఆకర్షిస్తోంది.

Related Posts