సంక్రాంతికి నేనూ ఉన్నా – హను మాన్

సంక్రాంతి అంటేనే పెద్ద చిన్న సినిమాల మధ్య యుద్ధం సాగుతుంది. ఇక్కడ సీనియర్ హీరోల సినిమాలు కూడా చిన్నవిగానే చూస్తుంటారు కొందరు. ముఖ్యంగా ఆ టైమ్ కు విడుదలవుతున్న సినిమాల నిర్మాతలే రిలీజ్ టైమ్ ను శాసిస్తారు అనేది నిజం. ఇక ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ బాగానే ఉండబోతోంది.

మామూలుగా ఈ టైమ్ లో ఓ రెండు మూడు పెద్ద సినిమాలు, ఒకటీ రెండు మీడియం రేంజ్ సినిమాలు ఉండటం కామన్. ఈ సారి కూడా అలాగే ఉంది. కానీ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా మాస్ మహరాజ్ రవితేజ ఈగిల్ సినిమా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించి.. కర్చీఫ్‌ వేశాడు. ఇక అదే రోజు వెంకటేష్‌ సైంధవ్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఆ విషయం తేలాల్సి ఉంది.


14న లేదా 12న దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ – మృణాళినీ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఫ్యామిలీ మేన్(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని విడుదల చేయొచ్చు. 14న గుంటూరు కారం వస్తుందనే అంటున్నారు.

గుంటూరు కారం విడుదల విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బట్ నైన్టీ నైన్ పర్సెంట్ సంక్రాంతికే వస్తుందనేది మేకర్స్ చెబుతున్న మాట. వస్తే గుంటూరు కారం 14న విడుదలవుతుంది. గతంలో ఇలాంటి పోటీలోనే దిగి తన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని 15న విడుదల చేసి పెద్ద హిట్అందుకున్న నాగార్జున మరోసారి అదే ప్లానింగ్ తో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన 99వ సినిమాగా రూపొందుతోన్న ‘ నా సామిరంగా’ను జనవరి 15న విడుదల చేస్తారంటున్నారు.


ఇక ఈ హడావిడీలో ఎప్పటి నుంచో సంక్రాంతి బరిలోనే ఉన్నానని చెబుతున్న హను మాన్ చిత్రాన్ని అందరూ మర్చిపోతున్నారు. అందుకే పండగ సీజన్ లో మేమూ ఉన్నాం అంటూ హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది.

https://x.com/AndhraBoxOffice/status/1594592057926246400?s=20

‘హాను మాన్ ఆన్ జనవరి 12’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. సో ఈ గొడవలో మమ్మల్ని మర్చిపోతున్నారేమో మేమూ ఉన్నాం అని చెప్పడమే అతని ఉద్దేశ్యం. ఇక ఈ హను మాన్ టీజర్ కు దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే మంచి కంటెంట్ కూడా ఉంటే సంక్రాంతి బరిలో విజేత అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా సలార్ డిసెంబర్ 22న వస్తుండటంతో ఆ టైమ్ కు షెడ్యూల్ అయిన మూడు నాలుగు సినిమాలు అతలాకుతలం అవుతున్నాయనేది నిజం.

Related Posts