‘మంజుమ్మల్ బాయ్స్’ టీమ్‌ కి ఇళయరాజా నోటీసులు

మలయాళం చిత్ర పరిశ్రమలో సరికొత్త కలెక్షన్ల బెంచ్ మార్క్ సెట్ చేసిన మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’. ఏ చిత్ర పరిశ్రమలోనైనా అగ్ర కథానాయకుల సినిమాలు సాధించే వసూళ్లు అత్యధికంగా ఉంటాయి. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకపోయినా.. కథే హీరోగా రూపొంది అఖండ విజయాన్ని సాధించింది ‘మంజుమ్మల్ బాయ్స్’.

కొడైకెనాల్ బ్యాక్ డ్రాప్ లో చిదంబరం దర్శకత్వంలో షౌబిన్ షాహిర్ నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగులో కూడా అనువాద రూపంలో విడుదలైన ‘మంజుమ్మల్ బాయ్స్’కి మంచి ఆదరణ దక్కింది. మే 3 నుంచి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ లోనూ సందడి చేస్తుంది. మొత్తంగా.. థియేట్రికల్ రన్ ముగిసిన.. ఓటీటీ లోనూ సందడి చేస్తోన్న ‘మంజుమ్మల్ బాయ్స్’ టీమ్ కు ఓ వివాదం చుట్టిముట్టింది. అది కూడా మాస్ట్రో ఇళయరాజా నుంచి.

‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా ఆద్యంతం గుణ కేవ్స్ నేపథ్యంలో సాగుతోంది. అంటే.. కమల్ హాసన్ నటించిన ‘గుణ’ సినిమాని చిత్రీకరించిన ప్లేసులోనే ఈ సినిమాని తీశారు. అలాగే.. ‘గుణ’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘ప్రియతమా నీవచట కుశలమా’ని ఈ సినిమాలో ఎక్కువగా ఉపయోగించారు. అదే ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ కొంప ముంచింది.

తన అనుమతి లేకుండా ‘గుణ’ చిత్రంలోని పాట ఉపయోగించడం పట్ల మాస్ట్రో ఇళయరాజా ‘మంజుమ్మల్ బాయ్స్’ టీమ్ కు లీగల్ నోటీసులు పంపించారట. ఇళయారాజ ఈమధ్య వరుసగా ఎవరో ఒకరికి లీగల్ నోటీసులు పంపించడం పరిపాటిగా మారింది. మరి.. ‘మంజుమ్మల్ బాయ్స్’ విషయంలో ఇళయరాజా వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

Related Posts