‘కల్కి’ టికెట్ రేట్లు ఆకాశాన్నంటాయి..!

కొన్ని ప్రదేశాల్లో ‘కల్కి’ టికెట్ రేట్లు ఆకాశాన్నంటాయి. అయినా.. టికెట్లు దొరకని పరిస్థితి. చాలా రోజుల తర్వాత థియేటర్లలోకి వస్తోన్న పెద్ద సినిమా ఇది. అందుకే.. ‘కల్కి’ చిత్రాన్ని తొలి రోజే చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈకోవలోనే.. టికెట్ ధర ఎంతైనా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలని ఆసక్తితో ఉన్నారు రెబెల్ ఫ్యాన్స్.

లేటెస్ట్ గా ముంబైలోని మైసన్ ఐనాక్స్ లోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ ధర రూ.2,3000 కి విక్రహిస్తోంది. అయినా.. ‘కల్కి’ మీదున్న క్రేజ్ నేపథ్యంలో అంత పెట్టి టికెట్స్ కొంటున్నారు ఫ్యాన్స్. దేశవ్యాప్తంగా మరికొన్ని మల్టీఫ్లెక్స్ లలో టికెట్ రేట్లు రూ.1760, రూ.1560 గా ఉన్నాయి.

మరోవైపు.. ఓవర్సీస్ లో ‘కల్కి’ ప్రి టికెట్ సేల్స్ రూపంలో 2 మిలియన్ డాలర్స్ కు పైగా కొల్లగొట్టింది. అమెరికా వంటి ప్రదేశాల్లో ‘కల్కి’ టికెట్ ధర 35 డాలర్లకు పైగానే ఉంది. ఇక.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి’ కోసం టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాయి ప్రభుత్వాలు. ఈ లెక్కన చూస్తుంటే.. ‘కల్కి’ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.200 కోట్లు గ్రాస్ వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

Related Posts