మల్టీస్టారర్స్ చేయడానికి నేను రెడీ.. శ్రీవిష్ణు

శ్రీవిష్ణు గారు ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. ‘ఓం భీమ్ బుష్‘ సినిమా ప్రచార చిత్రాలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుంది?
‘ఓం భీమ్ బుష్‘తో ఇప్పుటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ కొత్త పాయింట్ చెప్పబోతున్నాం. ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక విధంగా ఇదొక మల్టీజానర్ మూవీ అని చెప్పొచ్చు. టోటల్ మూవీని ఎంటర్ టైనింగ్ వేలో చెప్పాం. అందరూ ఈ సినిమా చూసి ఎంటర్ టైన్ అవుతారు.

కథ అనుకున్నప్పుడే ‘ఓం భీమ్ బుష్‘ టైటిల్ అనుకున్నారా?
కథ అనుకున్నప్పుడు టైటిల్ అనుకోలేదు. ఈ సినిమాకోసం మొదట మావాళ్లంతా కొన్ని ఇంగ్లీష్ టైటిల్స్ అనుకున్నారు. అయితే.. నేను మాత్రం ఈ చిత్రానికి తెలుగు టైటిల్ ఉండాలని పట్టుబట్టాను. అలా.. నా ప్రోద్భలంతోనే ‘ఓం భీమ్ బుష్‘ టైటిల్ వచ్చింది. సినిమా ఫస్ట్ కట్ చూసిన తర్వాతే ‘ఓం భీమ్ బుష్‘ టైటిల్ డిసైడ్ చేశాము.

మీ గత సినిమాలన్నింటిలో టైటిల్స్ కి మీరు చాలా ప్రాముఖ్యత ఇస్తారు?
అవును.. టైటిల్స్ గురించి నేను ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తాను. టైటిలే ముందు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అందుకే.. నా సినిమాల టైటిల్స్ విషయంలో నేను కూడా ఎక్కువగా కసరత్తులు చేస్తాను.

‘ఓం భీమ్ బుష్‘ ఓ సరికొత్త కాన్సెప్ట్ తో వస్తుంది అంటున్నారు? మరి.. ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనుకుంటున్నారా?
బేసిగ్గా.. ఇలాంటి స్టోరీస్ ను స్క్రిప్ట్ చదివి డిసైడ్ చెయ్యలేం. కంప్లీట్ గా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ ల మీదే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పాయింట్ ఎప్పుడూ రాలేదు కాబట్టి.. ఇది ఇలా వర్కవుట్ అవుతుందని తెలీదు. అయితే.. ఎప్పుడూ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను.

ఒక స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకున్నప్పుడు మీ మార్కెట్ కాపాడుకోవడానికి మీరు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?
సీరియస్ గా చెప్పాలంటే నేను మార్కెట్ గురించి ఏమాత్రం ఆలోచించను. మార్కెట్ పెరగాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేదే. అయితే.. నేను చూసేదేమిటంటే పెట్టిన పెట్టుబడి పోకూడదని. నిర్మాతను దృష్టిలో పెట్టుకుని.. ఎంచుకున్న కథ ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో.. దానికి తగ్గట్టే బడ్జెట్ ను పెట్టమని కోరతాను. అయితే.. ఈ సినిమా వరకూ పెట్టిన పెట్టుబడికి మూడు, నా�