పవన్ కళ్యాణ్‌ ఓజిలో మరాఠీ ఇష్యూను ఎలా చూడాలి

కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల తెలియలేదు. బ్లాక్ బస్టర్ అయినా తెలియదలేదు కానీ.. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్‌ చాలా చాలా ఎక్స్ పర్మెంట్సే చేసి ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి ఎక్స్ పర్మెంట్ ను ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. చేస్తున్నారు కూడా. అయితే ఈ ఎక్స్ పర్మెంట్స్ గురించి తెలిసిన ప్రతిసారీ.. చాలా కమెంట్స్ వస్తుంటాయి. బట్ ఆ తర్వాత వాళ్లే సూపర్ అంటుంటారు. అలా కొన్నాళ్ల క్రితం.. పవన్ కళ్యాణ్‌ చేసిన బెస్ట్ ఎక్స్ పర్మెంట్స్ నే ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు.


ఫస్ట్ మూవీలోనే 20కి పైగా కార్లను చేతులపై పోనిచ్చుకుని స్టంట్స్ పరంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఒరిజినల్ స్టంట్స్ చూసి అప్పట్లో ప్రతి యంగ్ హీరో కూడా ఏదో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరూ పవన్ రేంజ్ లో మెప్పించలేదు.

ఖుషీ సినిమాలో పూర్తి స్థాయిలో హిందీ పాట పెట్టించాడు. ఈ ఆలోచన పూర్తిగా పవన్ కళ్యాణ్‌ దే. ఒరిజినల్ లో ఆ పాట ఉండదు. బట్ పవన్ చేయించిన ఈ ప్రయోగానికి అప్పటికి భాష తెలియని వాళ్లు కూడా పాడుకున్నారు. వీళ్లంతా అంతకు ముందు తెలుగు సినిమాలో హిందీ పాటేంటీ అని కమెంట్స్ చేసినవాళ్లే. బట్ సినిమాలో అది సరిగ్గా సెట్ అయింది. అందుకే అర్థం కాకపోయినా సూపర్బ్ అనేశారు.


తమ్ముడు సినిమాలోనూ ఓ ఇంగ్లీష్ పాట ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ సాంగ్ అర్థం ఏంటీ అనేది ఎవరికీ అప్పట్లో తెలియదు. ఏ కొద్దిమందికో తెలిసి ఉండొచ్చు. కానీ మూడొంతులకు పైగా ప్రేక్షకులకు ఆ పాట భావం తెలియదు. బట్ ఆ ఎమోషన్ లో ఎగ్జైటింగ్ చూశారు. సూపర్ అనేశారు. అసలు తెలుగు సినిమాలో హిందీ పాటే ఎక్కువ అంటే ఇంగ్లీష్ సాంగ్ కూడా పెట్టేసి శభాష్ అనిపించుకున్నాడు పవన్. ఇది కూడా ఆయన ఆలోచనే.

అంతెందుకు.. బద్రి సినిమాలోని ఓ పాటలో హే చికితా.. గుమస్తాస్ అని అరుస్తాడు.. ఆయనతో పాటే ఆడియన్స్ ఇప్పటికీ ఆ పాట వచ్చిన ప్రతిసారీ అరుస్తూనే ఉన్నారు.. ఉంటారు. మరి దీని అర్థం ఏంటీ అంటే ఎవరైనా చెప్పగలరా.. చెప్పలేం. బట్ అప్పటికి పవన్ అన్నాడు.. మనమూ అనేశాం. వీటితో పాటే తీన్మార్ సినిమాలో ఓ ఇటాలియన్ సాంగ్ ఉంటుంది. పంజా సినిమాలో మరో హిందీ సాంగ్. వీటి అర్థాలు తెలుసా అంటే తెలియదు. అయినా ఎంజాయ్ చేశాం. నిజానికి ఇవన్నీ పవన్ కళ్యాణ్‌ మాత్రమే చేసిన ఎక్స్ పర్మెంట్స్. ఒక సినిమా ఇలాగే ఎందుకు ఉండాలి.. పాట మన భాషలోనే ఉండాలా.. ప్రాంతాన్ని బట్టి పాటలు ఉంటే తప్పేంటీ అనే ఆలోచన నుంచి వచ్చినవే.ఓ రకంగా ఇవన్నీ ప్యాన్ ఇండియన్ థాట్స్. అప్పుడు తెలియదు. ఇప్పుడూ తెలియదు. బట్ ఎప్పుడూ ఎంజాయ్ చేస్తున్నాం.


ఇక తాజాగా ఓజి సినిమాలో మరాఠీ మాటలు అంటూ మళ్లీ ఎప్పట్లానే కమెంట్స్ చేస్తున్న వాళ్ల కోసమే ఈ ఉదాహరణలన్నీ. ఇప్పటి వరకూ చూసినవన్నీ అర్థమయ్యే చూశామా.. ఆనందించేందుకే చూశాం. ఇదీ అంతే. ఓజి మరాఠీలోనూ ఇంకేదైనా మ్యాజిక్ ఉందేమో.. ఆ మ్యాజిక్ నే మళ్లీ ప్రేక్షకులు పదే పదే మాట్లాడుకుంటారేమో.. అందుకే కొన్ని ప్రయోగాలను ఆరంభ దశలో కాదు. విడుదలైన తర్వాతే అంచనా వేయాలి. విశ్లేషించాలి.

Related Posts