‘ఆర్.ఆర్.ఆర్’ని పొగడ్తలతో ముంచెత్తిన హాలీవుడ్ నటి

విడుదలై రెండేళ్లు దాటినా గ్రేటెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’పై ఇప్పటికీ ఎవరో ఒకరు ప్రశంసలు వర్షం కురిపిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ను పొగడ్తలతో ముంచెత్తింది హాలీవుడ్ హీరోయిన్ అన్నే హాత్వే. హాలీవుడ్ లో ‘ది ప్రిన్సెస్ డైరీస్, బ్రోక్‌బ్యాక్ మౌంటేన్, లెస్ మిసరబుల్స్, ది డార్క్ నైట్ రైజెస్, ఇంటర్ స్టెల్లార్’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అన్నే హాత్వే. ‘లెస్ మిసరబుల్స్’ మూవీలోని తన పెర్ఫామెన్స్ కు గానూ ఆస్కార్ అవార్డ్ కూడా అందుకుంది.

లేటెస్ట్ గా న్యూయార్క్ లో ప్రియాంక చోప్రా నటించిన ‘ది ఐడియా ఆఫ్ యు’ ప్రీమియర్‌కు హాజరైంది అన్నే హాత్వే. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ పట్ల తనకున్న ప్రేమ గురించి చెప్పింది.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని.. ఆ సినిమాలోని ప్రతి ఒక్కరినీ ప్రేమించాను అని.. వాళ్లలో ఎవరితోనైనా పనిచేయడం తనకు ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం ‘ఆర్.ఆర్‌.ఆర్’పై అన్నే హాత్వే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Posts