టీడీపీ లో చేరిన నిఖిల్! నిజమెంత?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి మధ్య ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నటరత్న నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ తెలుగు దేశం పార్టీ. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలలోనూ సినీ గ్లామర్ పెరుగుతుంది. ఈకోవలోనే.. తాజాగా తెలుగు దేశం పార్టీలో యంగ్ హీరో నిఖిల్ చేరాడనే ప్రచారం జరుగుతుంది. హీరో నిఖిల్ సిద్ధార్థ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరారని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

అయితే.. ఇందులో నిజం లేదట. చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్.. నిఖిల్ కి మావయ్య అవుతారు. ఈ సందర్భంగానే నిఖిల్ నారా లోకేష్ ని కలిశాడట. కానీ.. నిఖిల్ టీడీపిలో జాయిన్ కాలేదనేది ఆయన పీఆర్వో ఇచ్చిన వివరణ. మొత్తంమీద.. ఈ విషయాన్ని ట్విట్టర్ లో కూడా పంచుకున్నాడు నిఖిల్. తమ కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు నారా లోకేష్ కి థ్యాంక్స్ చెబుతూ స్పెషల్ ట్వీట్ చేశాడు నిఖిల్.

Related Posts