మా ఊరి పొలిమెర2 నుంచి హార్ట్ టచింగ్ సాంగ్

ఇవాళా రేపు పాటలు పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఒక్క పాటైనా సరే అద్భుతం అనిపించుకుంటే చాలు.. అద పనిగా ఆడియన్స్ ఆ పాటను చూస్తూనే ఉన్నారు.ఈ రకంగా కూడా ఆ పాటలు యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. కొన్నిసార్లు మెలోడీ సాంగ్స్ వస్తే.. మరికొన్నిసార్లు సినిమా థీమ్ కు సంబంధించిన పాటలు వస్తుంటాయి. అలా మా ఊరి పొలిమెర సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన సాంగ్ బలే ఆకట్టుకుంటోంది. ఆ మధ్య జానపద పాటలు, బాణీలతో తక్కువ పాటలతోనే టాలీవుడ్ ను ఊపేసిన పెంచల దాస్ ఆలపించిన ఈ గీతం వినగానే ఆకట్టుకునేలా ఉంది.


“ఏ కొండ సాటునో జాబిల్లి కూలిపాయొనే.. ఏ మబ్బుమాటునో ఎన్నెల్లు మాసిపాయొనే.. గుండెను ఉరి తీసి బతుకును ఎలిఏసి.. పానముకు మసిబూసి సితి నవ్వెను చూసి.. యాడికి పాయొనో రా సిలకా.. తిరిగి రాని ఓ దారెనకా.. ” అంటూ సాగే ఈ గీతాన్ని రాకేందు మౌళి రాశాడు. గ్యాని సంగీతం అందించాడు. అయితే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ చూసిన ఎవరికైనా ఇది ఏ సందర్భంగా వచ్చే పాటో అర్థం అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో చినపోయాడు అనుకున్న ఆటో డ్రైవర్(సత్యం రాజేష్‌) కోసం అతని భార్య పడుతున్న తాపత్రయమే ఈ గీతం అనుకోవచ్చు.
ఇక శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గౌరి క్రిస్న నిర్మించాడు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేశాడు.

నిజానికి మొదటి భాగాన్ని ఓటిటిలో విడుదల చేశారు. అప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందన వల్లే.. ఇప్పుడు ఈ రెండో భాగాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. నవంబర్ 2న విడుదల కాబోతోన్న సినిమా ఇది. ఈ మధ్య కాలంలో ఫస్ట్ పార్ట్ చూసిన ప్రతి ఒక్కరూ సీక్వెల్ కోసం డిమాండ్ చేసిన సినిమాగా ఈ పొలిమెర2ను చెప్పుకోవచ్చు. మరి ఈ సెకండ్ పార్ట్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.