‘భాగమతి’ దర్శకుడితో హవీష్ ‘యస్ బాస్’

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయం సాధించేందుకు కొంతమంది సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిలో యువ హీరో హవీష్ ఒకడు. కె.ఎల్. యూనివర్శిటీ పెద్ద విద్యాసంస్థలు నడుపుతున్న కోనేరు సత్యనారాయణ తనయుడు హవీష్. అయినా.. సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తో ఈ రంగంలో హీరోగా ఎదగాలనే తాపత్రయంతో ఉన్నాడు. ఇప్పటికే ‘నువ్విలా, జీనియస్, రామ్ లీల, సెవెన్’ వంటి సినిమాల్లో నటించిన హవీష్.. లేటెస్ట్ గా ‘యస్ బాస్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ చిత్రానికి ‘పిల్లజమీందర్, భాగమతి’ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతుందట. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందనే ఆశాభావంతో ఉన్నాడు హవీష్. లేటెస్ట్ గా హవీష్ బర్త్ డే స్పెషల్ గా ‘యస్ బాస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయ్యింది.

Related Posts