ఆల్ ఇండియాలోని పాపులర్ స్టార్స్ లో సగం మనవాళ్లే..!

టాలీవుడ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అసలు ఇండియా మొత్తాన్ని ప్రతిబింబించే ఇండస్ట్రీగా బాలీవుడ్ ని చెప్పుకుంటారు. అలాంటిది.. సినిమా ప్రొడక్షన్ పరంగా, స్టార్ స్టేటస్ పరంగానూ ఇప్పుడు బాలీవుడ్ కి మించిన రీతిలో దూసుకుపోతుంది టాలీవుడ్. అందుకు లేటెస్ట్ ఎగ్జాంఫుల్ ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే.

ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు ఆల్ ఇండియా లెవెల్ లో పాపులర్ స్టార్స్ గురించి సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా మార్చి 2024 కి సంబంధించి మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ ఆఫ్ ఆల్ ఇండియా ను అనౌన్స్ చేసింది. 10 మందితో కూడిన ఈ లిస్టులో 5 గురు తెలుగు వారే కావడం విశేషం.

ఈ టాప్-10 లిస్ట్ లో మొదటి స్థానాన్ని బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఆక్రమిస్తే.. రెండో స్థానంలో మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా విజయ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. మొత్తంమీద.. ఈ లిస్టులో టాలీవుడ్ నుంచి 5 గురు, బాలీవుడ్ నుంచి 4 గురు, కోలీవుడ్ నుంచి ఒక్కరు ఉన్నారు.

Related Posts