‘అన్ స్టాపబుల్-3‘ కోసం అదిరిపోయే ప్లాన్

నటసింహం బాలకృష్ణ వెండితెరపై నట విశ్వరూపాన్ని చూపిస్తే.. ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ కోసం తనలోని హ్యూమర్ యాంగిల్ ని బయటకు తీశాడు. బాలయ్య తనదైన స్టైల్ లో ఈ షోని పంచ్ లతో, హ్యూమర్ తో నడిపిస్తూ ఇండియాలోనే నంబర్ వన్ గా నిలిపాడు. సీజన్ 1 లో మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని ఇలా పలువురు స్టార్స్ తో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ‘అన్ స్టాపబుల్‘ రెండో సీజన్ లోనూ ఎంటర్ టైన్ మెంట్ డబుల్ అయ్యింది.

సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు సందడి చేశారు. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో మరో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటి ఫేమస్ పొలిటీషియన్స్ తో పాటు లెజెండరీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అయిన రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారు పాల్గొన్నారు. ఇక ప్రభాస్ తో చేసిన ఎపిసోడ్ అయితే ఓ రేంజులో సక్సెస్ అయ్యింది.

‘అన్ స్టాపబుల్2‘లోని చివరి ఎపిసోడ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సమ్ థింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దింది ‘ఆహా‘ టీమ్. రెండు పార్టులుగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ సీజన్ 2 కే హైలైట్ అయ్యింది. ఇక.. ‘అన్ స్టాపబుల్1, 2‘లతో అలరించిన నటసింహం ఆడియన్స్ కు నెవర్ బిఫోర్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు మూడో సీజన్ తో ముస్తాబవుతున్నాడట.

దసరా నుంచి ‘అన్ స్టాపబుల్ 3‘ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతన్నట్టు తెలుస్తోంది. మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ అతిథులుగా హాజరుకానున్నారట.

Related Posts