ఏజెంట్ ను ఓడించిన ఎంటర్టైన్మెంట్ ..

బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ అంటే చిన్న పెద్ద హీరోలైనా ఇంట్రెస్టింగ్ గానే చూస్తారు ఆడియన్స్. విన్నర్ ఎవరా అని నెక్స్ట్ డే కి డిక్లేర్ అవుతుంది. అలా ఈ గురువారం బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఇద్దరిలో విన్నర్ గా నిలిచాడు శ్రీ విష్ణు.


ఈ గురువారం నిఖిల్ సిదార్థ్ స్పై మూవీ తో వచ్చాడు. కార్తికేయ సీక్వెల్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో హిట్ కొట్టిన అతను ఆ స్పాన్ ను మరింత పెంచుకునేందుకు స్పై తో చేసిన ప్రయత్నం ఫలించలేదు. బలహీనమైన కథ, కథనాలతో వచ్చిన ఈ మూవీ మొదటి ఆటకే డిజాస్టర్ గా డిక్లేర్ అయింది.

హిస్టరీ ని మార్చారు అంటూ కొత్త కహానీలు చెప్పబోయిన వీరి ప్రయత్నాన్ని ప్రేక్షకులకు తిప్పి కొట్టారు. దర్శకత్వ లోపం.. వీక్ నేరేషన్ వాళ్ళ భారీ అంచనాల మధ్య విడుదలైన స్పై డిజాస్టర్ అనిపించుకుంది.


ఇక ప్రమోషన్స్ తో ఆకట్టుకున్నా పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన సమజవరగమనా సూపర్ హిట్ గా నిలిచింది . క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో ఫామిలీ అంతా కలిసి చూసేలా మంచి నవ్వులు పండించింది ఈ మూవీ.

ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్న శ్రీ విష్ణు మరోసారి ఎంటర్టైన్మెంట్ తో విజయం సాధించాడు. అతనితో పాటు నరేష్, వెన్నెల కిశోర్ కామెడీ హైలైట్ అయింది. సో ఈ గురువారం పోటీ పడ్డ ఈ టైర్ 2 హీరోస్ లో శ్రీ విష్ణు విన్నర్ గా నిలిచాడు.

Related Posts