హిట్ డైరెక్టర్ ను పట్టిన దిల్ రాజు

ఈ మధ్య వరుసగా భారీ చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తూనే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు దిల్ రాజు. బడ్జెట్ పరంగానూ ఇంతకు ముందు ఉన్నంత కండీషనల్ గా ఉండటం లేదు. ఎంత బడ్జెట్ అయినా ఎస్ అంటున్నాడు అంటున్నారు. ఈ క్రమంలోనే మరో భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం చుడుతున్నాడు. అది కూడా ఆల్రెడీ హిట్స్ కొట్టిన దర్శకుడితో. పైగా ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసుకున్నాడు. అందుకే బాలీవుడ్ హీరోను తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి ఆ హిట్ డైరెక్టర్ ఎవరో గెస్ చేశారు కదా..?


నాని నిర్మాతగా ”హిట్” అనే చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు డాక్టర్ శైలేష్‌ కొలను. విశ్వక్ సేన్ హీరోగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీంతో ఇదే బ్యానర్ లో ఈ సారి అడవి శేష్‌ హీరోగా హిట్2 రూపొందిస్తే ఇదీ హిట్ అయింది. ఇక ఈ చిత్రాన్ని హిట్ ఫ్రాంచైజీగా మార్చాడు శైలేష్. ప్రస్తుతం నాని బ్యానర్ నుంచి బయటకు వచ్చి విక్టరీ వెంకటేష్ హీరోగా ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు.

వెంకీకి ఇది 75వ సినిమా. భారీ బడ్జెట్ తోనే వస్తోందని చెబుతున్నారు. ఈ సైంధవ్ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ దర్శకుడితోనే దిల్ రాజు ఓ ప్యాన్ ఇండియన్ మూవీకి శ్రీకారం చుడుతున్నాడు. సైంధవ్ మూవీ రిజల్ట్ ను బట్టి దిల్ రాజు మరింత బడ్జెట్ పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు.


ఇక దిల్ రాజు – శైలేష్‌ కొలను కలయికలో వచ్చే చిత్రం కూడా ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే అంటున్నారు. ఇది ప్యాన్ ఇండియన్ లెవల్లో వర్కవుట్ అవుతుందనే బాలీవుడ్ హీరో కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఎవరూ సెట్ కాకపోతే తెలుగు హీరోతోనే చేస్తారట. అయితే శైలేష్‌ కొలను తన ఫ్రాంచైజీని కంటిన్యూ చేస్తూ నానితో హిట్3 చేస్తానని గతంలోనే చెప్పాడు. ఆ ప్రాజ