ధనుష్‌.. అప్పుడు లవ్.. ఇప్పుడు ఫైర్

ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే హీరో ధనుష్‌. అతన్ని స్టార్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఏ సినిమా చేసినా, ఆ పాత్రలో ఒదిగిపోతాడు. తన ఫిజిక్ ను దాటి ఏ పాత్రైనా ప్రదర్శించగల సత్తా ఉన్న నటుడు. అందుకే అతని ఖాతాలో ఇప్పటికే బెస్ట్ యాక్టర్ గా రెండు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. ఇక తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, హాలీవుడ్ లోనూ నటిస్తోన్న ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్ అయింది.

అది హిందీలో. పదేళ్ల క్రితం ధనుష్‌ ఫస్ట్ హిందీ మూవీ చేశాడు. పేరు రాంఝనా. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎపిక్ లవ్ స్టోరీ అని చెప్పారు. ముఖ్యంగా ధనుష్‌ నటనకు బాలీవుడ్ ఫిదా అయిపోయింది. సోనమ్ కపూర్ కు మొదటి సారిగా నటిగా మంచి ప్రశంసలు వచ్చింది ఈ చిత్రానికే కావడం విశేషం. అలాంటి దర్శకుడితో ధనుష్ సెకండ్ మూవీ చేయబోతున్నాడు.


ధనుష్‌, ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి ”తేరే ఇష్క్ మే” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రాంఝనా కథను ఉటంకిస్తూ.. ధనుష్ డైలాగ్స్ చెబుతూ.. చేతిలో ఫైర్ బాటిల్, నోట్లో సిగరెట్ తో పరుగెడుతూ.. అప్పుడు కుందన్.. ఇప్పుడు శంకర్ అని చెబుతూ ఆ ఫైర్ బాటిల్ ను రాంఝనా అన్న బోర్డ్ పై విసురుతాడు.

ఆ ఫైర్ కు మొత్తం మంటలు వ్యాపిస్తే.. అక్కడి నుంచి ధనుష్‌ ఫెరోషియస్ నడుచుకుంటూ వస్తోన్న ఈ గ్లింప్స్ చూస్తే ఈ సారి రాంఝనా అంత సెన్సిబుల్ గా రావడం లేదు అని అర్థం అవుతోంది. మొత్తంగా ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబో అంటే ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనేలా ఉందీ గ్లింప్స్. మరి ఈ మూవీతో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.