భారీ స్థాయిలో ‘దేవర’ ప్రి-రిలీజ్ బిజినెస్

తెలుగులో రాష్ట్రాల్లో ‘దేవర’ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్, నైజాం లలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రలో ‘దేవర’ రూ.55 కోట్లకు అమ్ముడయ్యిందట. ఇక.. నైజాంలో రూ.45 కోట్లు, సీడెడ్ లో రూ.23 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.

ఇటీవలే గోవాలోని ఫారెస్ట్ లో హై వోల్టేజ్ యాక్షన్ పూర్తిచేసిన ఎన్టీఆర్.. ప్రస్తుతం థాయ్‌లాండ్ వెళ్లాడు. తారక్ కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. థాయ్‌లాండ్ లో ‘దేవర’ కోసం ఓ పాటను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘దేవర’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ రాగా.. త్వరలో సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్. సెప్టెంబర్ 27న ‘దేవర’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts