పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమలాపాల్

నటీమణి అమలా పాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు జూన్ 11న పుట్టాడని.. అతనికి ‘ఇళై’ (ILAI) అని పేరు పెట్టామని సోషల్ మీడియా వేదికగా తెలిపింది అమలా పాల్. ఆమె భర్త జగత్ దేశాయ్ కూడా ఇదే పోస్ట్ ను షేర్ చేశారు. జగత్ దేశాయ్ తో అమలా పాల్ వివాహం గతేడాది జరిగింది. ఈ దంపతులిద్దరూ ఎప్పటికప్పుడు తమ విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. గతంలో దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలా పాల్. వాళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు.

సినిమాల విషయానికొస్తే.. ‘నాయక్, ఇద్దరమ్మాయిలు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమలాపాల్.. తమిళ, మలయాళ సినిమాలలో బాగానే పేరు తెచ్చుకుంది. ఇక.. చాలా కాలం తర్వాత బోల్డ్ మూవీ ‘ఆమె’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంచిన అమలా పాల్.. ఈ ఏడాది ‘ఆడు జీవితం’ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమలా పాల్ కిట్టీలో రెండు మలయాళం సినిమాలున్నాయి.

Related Posts