‘కల్కి‘ రన్ టైమ్ పై వచ్చిన క్లారిటీ

ప్రభాస్ ‘కల్కి 2898 AD‘పై అంచనాలు రోజుకు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ విడుదలవుతోన్న సరికొత్త ప్రచార చిత్రాలతో.. ఆ అంచనాలు మరింత రెట్టింపవుతున్నాయి. ‘కల్కి‘ చిత్రం ఆడియన్స్ ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి.. మంచి విజువల్ ట్రీట్ అందించడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.

లేటెస్ట్ గా ‘కల్కి‘ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘యు/ఎ‘ సర్టిఫికెట్ జారీ చేసిందట సెన్సార్ బోర్డు. ఇక.. ‘కల్కి‘ సినిమా మొత్తం నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి అర్థ భాగం 1 గంట 33 నిమిషాలు కాగా.. రెండో అర్థ భాగం 1 గంట 27 నిమిషాలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. జూన్ 27న ‘కల్కి‘ విడుదలకు ముస్తాబవుతోంది. జూన్ 26 నుంచే ఈ సినిమా ప్రీమియర్స్ మొదలవ్వనున్నాయి.

Related Posts