సీక్రెట్ లు ఎప్పుడూ చెవిలోనే చెప్పాలి

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సినిమాలు చేస్తున్నాడంటే ఆయన ఇమేజ్ కు తగ్గ కథలు ఎంచుకుంటాడు. మరి నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడంటే.. తన మనసుకు నచ్చిన కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడని అర్థం. కొన్నాళ్లుగా ఇలాంటి కథలను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు రవితేజ. అలా ఆయన నిర్మించిన లేటెస్ట్ మూవీ ఛాంగురే బంగారు రాజా. సతీష్ వర్మ దర్శకుడు. కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఓ కుక్క పాత్రకు సునిల్ వాయిస్ అందించడం విశేషం. కొన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్ తోనే బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈ నెల 15న విడుదలయ్యే సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి. తెలుగు సినిమాలేం లేవు అనుకుంటున్న టైమ్ లో సడెన్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. ఆ మేరకు హడావిడీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి ట్రైలర్ విడుదల చేశారు.


ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. కంప్లీట్ ఫన్ రైడ్ లా దానికి కాస్త క్రైమ్ ఎలిమెంట్స్ యాడ్ చేసినట్టుగా కనిపిస్తోంది. రంగురాళ్లు దొరికే ఊరికి చెందిన కుర్రాళ్లకు కొన్ని విలువైన రాళ్లు దొరుకుతాయి. అంతకు ముందు వాళ్లు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆకతాయిగా ఉంటారు. ఈ రాళ్లు వాళ్ల లైఫ్ లోకి వచ్చిన తర్వాత అంతా ఉరుకులు పరుగులుగా మారుతుంది. మరోవైపు లోకల్ స్టేషన్ లో కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహారం కూడా ఉంది. మరి వీళ్లెందుకు పరుగులు తీస్తున్నారు. వీరి వెనక పోలీస్ లు, మరికొన్ని దొంగల ముఠాలు ఎందుకు పడుతున్నాయి. రంగురాళ్లు కాకుండా ఇంకేదైనా ఇంపార్టెంట్ మేటర్ ఉందా అనేది సినిమాలో తెలుస్తుంది.


రవితేజ సినిమా అంటే ఏదో విషయ ఉంటుందనే అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఉందీ ట్రైలర్. ప్రధాన పాత్ర ధారులకు తగ్గట్టుగా హెవీగా లేకుండా లైటర్ వే లోనే �