చంద్రముఖి2.. పోస్టర్ లో కొత్తదనం ఏముందీ

చంద్రముఖి.. రజినీకాంత్ హీరోగా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. పి వాసు డైరెక్ట్ చేసి ఈ చిత్రంలో జ్యోతిక, ప్రభు, నయనతార, వడివేలు కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా టైటిల్ రోల్ చేసిన జ్యోతిక నటనకు అప్పట్లో జనం భయపడ్డారు. నిజానికి ఈ మూవీ మళయాలంలో 1993లో వచ్చిన మణిచిత్ర తాళు కు రీమేక్.

అక్కడా బిగ్గెస్ట్ హిట్.ఆ సినిమాలో శోభన ప్రధాన పాత్ర చేసింది. మోహన్ లాల్, సురేష్ గోపీ నటించారు. ఇక తమిళ్ రీమేక్ టైమ్ కు వాసు ఎంటర్టైన్మెంట్ కోటా పెంచాడు. ఇది వర్కవుట్ అయింది. నవ్విస్తూనే భయపెట్టిన సినిమాగా బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులోనూ పెద్ద విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా నాగవల్లి అనే సినిమా వచ్చింది.వెంకటేష్ నటించిన ఈ సినిమా డిజాస్టర్.


ఇన్నాళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్ తో వస్తున్నాడు పి వాసు. ఈ సారి కామెడీ హారర్స్ తో ఆకట్టుకుంటోన్న లారెన్స్ ను హీరోగా చంద్రముఖి పాత్రకు కంగనా రనౌత్ ను తీసుకున్నాడు. కాంబినేషన్ తోనే కొంత క్రేజ్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ రెండు మూడు రోజుల నుంచి నానా హడావిడీ చేసిన పోస్టర్ విడుదలైంది.

బట్ ఈ పోస్టర్ లో అస్సలే మాత్రం కొత్తదనం లేదు. అప్పట్లో రజినీకాంత్ వెంకటపతి రాజా గెటప్ లో కనిపించిన గెటప్పే ఇది.కాకపోతే ఫేస్ ప్లేస్ లో లారెన్స్ మొహం ఉంది. అంత తప్ప అస్సలే మాత్రం కొత్తగా లేదు. ఆకట్టుకో