ఛా ఊర్కోండీ.. ఈ వయసులో నాకు పెళ్లేంటీ

పెళ్లంటే నూరేళ్ల పంట అనుకుంటారు కొందరు. కాదు నూరేళ్ల మంట అనుకుంటారు ఇంకొందరు. కొందరు ఆ పంట కోసం వెళ్లి తంటాలు పడుతుంటారు. ఇంకొందరు ఆ మంటలకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకుంటారు. అలా డిసైడ్ చేసుకున్న వారిని చూసి పెళ్లైన వాళ్లు ఎంత కుళ్లుకుంటారో వేరే చెప్పక్కర్లదు. ఎక్కువ బాధ్యతలు ఉండవు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తమ జీవితం తమకు నచ్చినట్టుగా బ్రతికేస్తుంటారు.

అలా ఒకప్పుడు హీరోయిన్ గా వెండితెరపై తనదైన శైలిలో ఆకట్టుకున్న బ్యూటీ సుకన్య కూడా పెళ్లి 2002లో ఒకసారి పెళ్లి చేసుకుంది. కానీ ఒక్క యేడాదికే పెళ్లి తన ఒంటికి పడదు అని డిసైడ్ అయి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తను సింగిల్ గానే ఉంటోంది. తెలుగులో తను పెద్దరికం, అమ్మ కొడుకు, ఖైదీ నెంబర్ వన్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. వీటిలో పెద్దరికం అప్పట్లో పెద్ద విజయం సాధించింది.

అయినా ఆమెకు సరైన ఆఫర్స్ రాలేదు. అందుకే తెలుగుకు దూరంగా ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు(మహేష్ బాబు మదర్ రోల్) చిత్రాల్లో నటించింది.
కొన్నాళ్ల క్రితం సుకన్య ఒక హోటెల్ లో వేరే వ్యక్తితో ఉందనే వార్త సంచలనం సృష్టించింది. తర్వాత అవన్నీ తను ఖండించింది. అలాగే 2017లో తను పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలూ వచ్చాయి. వీటినీ ఖండించాయి. ఇక తాజాగా మరోసారి ఆమె పెళ్లికి సిద్ధమైందన్న న్యూస్ సౌత్ మొత్తం వ్యాపించాయి.

దీంతో తను స్పందించింది. తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదు అంది. పైగా తన వయసు ఇప్పుడు 53యేళ్లు. ఈ వయసులో పెళ్లేంటీ అని కూడా అనేసింది. 50 యేంటి 60 దాటినా మూడు ముళ్లు వేయించుకుంటున్న కాలంలో ఈవిడ ఇట్టా అనడం ఆశ్చర్యమే అయినా మొత్తంగా సుకన్య పెళ్లి వార్తతో మరోసారి వార్తల్లోకి వచ్చింది.

Related Posts