‘బబుల్ గమ్’ రివ్యూ

నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, చైతు జొన్నలగడ్డ, హర్ష వర్ధన్, అను హాసన్ తదితరులు
సినిమాటోగ్రఫి: సురేష్ రగుతు
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
నిర్మాత: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023

టాలీవుడ్ లో వారసులకు ఏమాత్రం కొదవలేదు. ఈకోవలోనే.. ‘బబుల్ గమ్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు రోషన్ కనకాల. రజనీకాంత్, చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ కు నటనలో ఓనమాలు నేర్పించిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల మనవడు.. రాజీవ్, సుమ తనయుడైన రోషన్ కనకాల.. ‘బబుల్ గమ్’తో హీరోగా ఆకట్టుకున్నాడా? సినిమా ఎలా ఉంది? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ
పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి తరహా కథతోనే ‘బబుల్ గమ్’ రూపొందింది. ఆది (రోషన్ కనకాల) పక్కా హైదరాబాదీ కుర్రాడు. డిజె అవ్వాలని కలలు కంటాడు. పబ్‌లో అనుకోకుండా జాన్వీ(మానస చౌదరి)ని చూస్తాడు. ప్రేమలో పడిపోతాడు. లవ్-రిలేషన్స్ అంటే పెద్దగా పడని జాన్వీ.. ఆది ని తొలుత ఆట వస్తువుగా మాత్రమే చూస్తుంది. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. మరి.. భిన్న వ్యక్తిత్వాలు ఉన్న ఈ ఇద్దరి ప్రేమ ఫలించిందా? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ
‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి హిట్స్ తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు రవికాంత్ పేరెపు. కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ డైరెక్టర�