ఇస్రోకు శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య ..

చంద్రుని దక్షణ ధృవం పై ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించి చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ముందడుగు వేసారు ఇస్తో శాస్త్రవేత్తలు.

చంద్రుడుపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబందించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారతదేశం ముందుంటుంది. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్రవేత్తలకు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు.

శాస్త్ర సాంకేతిక, బౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించాలని కోరుకుంటున్నాను.140కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన భారత శాస్త్రవేత్తలకు మరోక్కసారి శుభాభినందనలు.

Related Posts