ఆగస్ట్ వార్ పై అదిరిపోయే అప్డేట్

స్టార్ హీరోల మధ్య వార్స్ అంటే ఫ్యాన్స్ మధ్య పోటీలు.. ఆడియన్స్ కు వినోదాలు డబుల్ అవుతాయి. పైగా కాంపిటీషన్ ఉంటేనే కదా ఖలేజా తెలుస్తుంది. అయితే ఒకప్పుడు స్ట్రాంగ్ సీజన్స్ లో మాత్రమే స్టార్ హీరోల మధ్య పోటీ ఉండేది. బట్ ట్రెండ్ మారింది. వీళ్లు పోటీ పడేదే స్ట్రాంగ్ సీజన్ అవుతోంది.

ఇక ఒకప్పుడు ఆగస్ట్ అంటే స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. బట్ ఇప్పుడలా కాదు. ఇండిపెండెన్స్ డే అంటే చాలా రోజులు ముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి పెట్టుకుంటున్నారు. ఒకవేళ రాలేపోతే జూలై చివర్లో చెబుతున్నారు తప్ప ఆ డేట్స్ ను వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. అలా ఈ సారి ఇండిపెండెన్స్ డే కు భారీ పోటీ ఉంది. విశేషం ఏంటంటే.. ఈ పోటీ మూడు భాషల నుంచి ముగ్గురు టాప్ హీరోల మధ్య ఉండబోతోంది. పైగా వీరిలో ఎవ్వరూ తగ్గేదే లే అంటున్నారు.


తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. ఈ డేట్ ను చాలా రోజుల ముందే ప్రకటించారు. మధ్యలో పోస్ట్ పోన్ చేస్తారు అనే టాక్ వినిపించినా అదేం లేదంటూ కొత్త పోస్టర్స్ వదిలి మరీ ఖరారు చేశారు. మెహర్ రమేష్‌ డైరెక్షన్ లో మెగాస్టార్ నటిస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్‌ చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో వచ్చిన వేదాళంకు రీమేక్. అయితే కథలో చాలా మార్పులు చేశారట. ఇంద్ర సినిమాలో లాగా కాశీ బ్యాక్ డ్రాప్ కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. ఆ మధ్య అక్కడ ఓ పాట కూడా చిత్రీకరించారు.


ఇక ఈ మూవీతో పాటు వస్తోన్న మరో సూపర్ స్టార్ మూవీ జైలర్. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మళ�