చిరంజీవిపై దారుణమైన కామెంట్స్

ఇవాళా రేపు సంయమనం అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. ఒక చిన్న మాటను కూడా ఎవరూ సహించలేకపోతున్నారు. కొన్ని పొలిటికల్ టర్న్స్ తీసుకుంటున్నాయి. మరికొన్ని వ్యక్తిగత విషయాలపై మళ్లుతున్నాయి. ఇంకొన్ని వ్యక్తిత్వ హననంగా సాగుతున్నాయి. బ్రో సినిమాలో ఒక చిన్న బిట్ కు ఏపి అధికార పార్టీ మంత్రి అంబటి రాంబాబు అది తనపైనే వేసిన సెటైర్ అంటూ పవన్ కళ్యాణ్‌ పైనా, సినిమాపైనా విరుచుకుపడ్డాడు. వరుస ప్రెస్ మీట్స్ తో హోరెత్తించాడు. అదేదో రాష్ట్రానికి పెద్ద అన్యాయం జరిగినంత హడావిడీ చేశాడు. దానికి జనసేన వాళ్లూ కౌంటర్స్ వేశారు. అయితే తాజాగా వాల్తేర్ వీరయ్య 200 రోజల ఫంక్షన్లో చిరంజీవి ఒక చిన్న మాట అన్నాడు. “యాక్టర్స్ రెమ్యూనరేషన్స్ గురించి ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయి. మీలాంటి వాళ్లు ప్రాజెక్ట్‌ లు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ప్రత్యేక హోదాల గురించి మాట్లాడాలి, ఆలోచించాలి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీపై పడతారెందుకు.. ” అదీ చిరంజీవి చేసిన కమెంట్స్. తర్వాత ఆ కామెంట్స్ ను మూవీ ఫంక్షన్ వీడియోస్ నుంచి తొలగించారు కూడా. అయినా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ చిన్నమాటకే ఎమ్మెల్యే నాని రెచ్చిపోయాడు.


” సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలేవో తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా.. రాజకీయాలు ఎందుకు..? డ్యాన్సులు, యాక్షన్, ఫైట్‌స్ గురించి చూసుకుందాం అని వాళ్లకు చెప్పొచ్చు కదా.. ” ఇదీ నాని రియాక్షన్. మెగాస్టార్ ను పకోడి గాళ్లు అనేంత దారుణమైన కమెంట్స్ చేయడం మరోసారి అతని అహంకారాన్ని సూచిస్తుంది. ఇష్యూ చిరంజీవిది కాదు. అయినా అంబటి వళ్ల నష్టపోయింది పవన్ కళ్యాణ్‌ కాదు. నిర్మాత. అందుకే చిరంజీవి స్పందించి ఉంటాడు. ఇక ఈ మాటలకు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రియాక్ట్ అయ్యాడు. ” అంటే మీరు పిచ్చుకలు అని ఒప్పుకున్నట్టే కదా.. ” అని ఇన్ డైరెక్ట్ గా మెగాస్టార్ కు కౌంటర్ వేశాడు. ఏదేమైనా బురదలో రాయి వేయకూడదు అని చిరంజీవికి మరోసారి అర్థమై ఉంటుంది.

Related Posts