HomeMoviesటాలీవుడ్అసలుసిసలు రాక్ స్టార్ అనిరుధ్

అసలుసిసలు రాక్ స్టార్ అనిరుధ్

-

సరిగ్గా పదకొండేళ్ల క్రితం ‘వై దిస్ కొలవెరి ఢీ’ అంటూ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు తెరలేపాడు అనిరుధ్ రవిచందర్. ధనుష్-శ్రుతి హాసన్ కలయికలో వచ్చిన ‘త్రీ’ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. సినిమా హిట్టవ్వకపోయినా.. ఈ మూవీలో ‘వై దిస్ కొలవెరి ఢీ’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక.. అప్పట్నించి మొదలైన అనిరుధ్ మ్యూజికల్ జోరు.. ఇప్పుడు జెట్ స్పీడులో దూసుకుపోతుంది. అక్టోబర్ 16న, అనిరుధ్ పుట్టినరోజు.

కోలీవుడ్.. ఆ తర్వాత టాలీవుడ్.. ‘జవాన్‘తో బాలీవుడ్ ని సైతం తన మ్యూజికల్ మ్యానియాతో మెస్మరైజ్ చేశాడు అనిరుధ్. అందుకే.. ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ హీరోస్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ గా తమకు ఇతనే కావాలంటూ పట్టుబడుతున్నారు. ముఖ్యంగా.. అనిరుధ్ మ్యూజిక్ లో ఓ మ్యాజిక్ ఉంది. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హీరోలను ఎలివేట్ చేయడంలో మాస్టర్ డిగ్రీ పొందాడు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్ ‘విక్రమ్, జైలర్, జవాన్‘ చిత్రాలే.

ప్రస్తుతం అనిరుధ్ సినిమాల స్పీడు మామూలుగా లేదు. తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఎన్టీఆర్ ‘దేవర‘ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రానికి సైతం అనిరుధ్ సంగీత దర్శకుడు. ఇక.. దసరా కానుకగా వస్తోన్న ‘లియో‘కి కూడా అనిరుధ్ మ్యూజిక్ మంచి ప్లస్ అవుతోందని భావిస్తున్నారు మేకర్స్. ఇంకా.. తమిళంలో రజనీకాంత్ 170, 171 చిత్రాలకు కూడా అతనే సంగీత దర్శకుడు. మొత్తంమీద.. మునుముందు మరెంతోమంది అగ్ర కథానాయకులకు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడానికి రెడీ అవుతోన్న అనిరుధ్ కి బర్త్ డే విషెస్ చెబుదాం.

ఇవీ చదవండి

English News