బుజ్జి వెహికల్ ను నడిపిన ఆనంద్ మహీంద్ర

సినిమా.. వాస్తవ సంఘటనలను ప్రతిబింబిస్తూ సాగే దృశ్య మాధ్యమం. అయితే.. కొన్నిసార్లు వాస్తవ జీవితానికి సైతం దిశా నిర్దేశం చేసేలా కొంతమంది దర్శకులు వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తుంటారు. వాస్తవంలో లేకపోయినా.. సినిమా కోసమే సరికొత్త వండర్స్ చేస్తుంటారు. అలాంటిదే.. ఇప్పుడు ‘కల్కి‘ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ‘బుజ్జి‘.

మహీంద్ర వంటి దిగ్గజం కంపెనీ టెక్నాలజీ సాయంతో ‘బుజ్జి‘ కస్టమ్ వెహికల్ ను ‘కల్కి‘ కోసం తయారు చేయించాడు నాగీ. అలా.. ‘బుజ్జి‘ వెహికల్ కి టెక్నాలజీ అందించిన మహీంద్ర అధిపతి ఆనంద్ మహీంద్ర.. ఈ కస్టమ్ వెహికల్ ను నడపడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్ర అంటూ ఆ వీడియోని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.

Related Posts