‘కల్కి‘ని ఆకాశానికెత్తేసిన అమితాబ్ బచ్చన్

‘మహానటి‘ వంటి ఘన విజయం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి‘. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ వంటి లెజెండ్స్ నటిస్తున్నారు. పైగా.. వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఎక్కువగా హైప్ లేకుండానే సైలంట్ గా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘కల్కి‘ చిత్రం ఇప్పుడు విడుదలకు దగ్గరవుతోంది. ఈనేపథ్యంలో.. ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా టీజర్, ట్రైలర్స్ రెడీ అవుతున్నాయి.

మరోవైపు ఇప్పటివరకూ ‘కల్కి‘ గురించి పెద్దగా విశేషాలు ఏమీ పంచుకోని బిగ్ బి అమితాబ్.. లేటెస్ట్ గా ఈ మూవీ గురించి ట్వీట్ చేశారు. ఏ నటుడు పొందని గొప్ప అనుభూతిని ‘కల్కి‘తో తాను అనుభవించానని.. అసలు ‘కల్కి‘ వంటి కథను ఊహించడం దగ్గర నుంచి.. ఈ సినిమాలో వాడిన మోడర్న్ టెక్నాలజీ గురించి.. అన్నింటికంటే మిన్నగా నిర్మాణ సంస్థ.. సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేయడం గొప్ప అనుభూతిని అందించింది అనే రీతిలో ట్వీట్ చేశారు బచ్చన్. ప్రస్తుతం అమితాబ్ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Related Posts