అల్లు రామలింగయ్య గారు చిరస్మరణీయుడు- మెగాస్టార్

ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడైన పద్మశ్రీ  అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ పలు కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా గత రాత్రి జరిగిన శతజయంతి వేడుకలకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ (అల్లు రామలింగయ్య కుమార్తె), అలాగే అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లు రామలింగయ్యపై రాసిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందించారు.ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు స్వర్గీయ అల్లు రామలింగయ్య సినీ రంగానికి చేసిన సేవల గురించి కొనియాడారు.

శతజయంతి వేడుకలో బ్రహ్మానందం గారు మాట్లాడుతూ…
ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ, అల్లు రామలింగయ్య గారితో తనకు ఏర్పడిన పరిచయాన్ని తెలిపారు.
అల్లు రామలింగయ్య గారకి బ్రతుకు విలువ, మెతుకు విలువ తెలిసినవాడు కాబట్టి ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో ఆయనకి తెలుసు.
అల్లు అరవింద్ లాంటి బిడ్డను కన్నందుకు ఆయన ఎంతగానో ఆనందిస్తారు.ఆయన ఎప్పటికి మన మధ్యలోనే ఉంటారు. అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ…
అల్లు రామలింగయ్య గారికి సినీపరిశ్రమలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు అల్లుడుగా వచ్చి ఆయన స్థాయిని ఎన్నో రేట్లు పెంచిన చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే పుస్తకాన్ని ఆవిష్కరించిన  మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి   , పుస్తకాన్ని రాసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…
ఆయనతో నాకు ఉన్న అనుబంధం ఇంకెవరితోను లేదు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అల్లు రామలింగయ్య గారిని మొదటి సారి చూసిన సమయంలోనే ఆయన తీరును చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ సమయంలో చాలా మంది ఉండగా ఆయన నా వైపే పదే పదే చూస్తూ నన్ను గమనించడం చేసేవారు. ఆ సమయంలో నాకు ఆయన ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత అర్థమైంది.అల్లు రామలింగయ్య గారు ఒకసారి షూటింగ్ పూర్తి చేసుకొని రైల్లో వెళుతున్న గా పక్కన కూర్చోబెట్టుకొని మందు తాగుతావా అ�