అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పుష్ప2 సినిమా చేస్తున్నాడు అర్జున్. ఈ మూవీ తర్వాత ఏంటా అంటూ కొన్ని రోజులుగా అదే పనిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఉన్నవి జవాన్ తర్వాత అట్లీతో చేస్తున్నాడు అని. అటుపై జైలర్ దర్శకుడు నెల్సన్ తోనూ కథా చర్చలు సాగాయి అనే న్యూస్ హల్చల్ చేశాయి. వీటికి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉండనే ఉంది. ఇప్పటికి ఈ వార్తల్లో ఉంటూ.. పుష్ప2కు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తోంటే ఐకన్ స్టార్ మాత్రం సడెన్ గా సర్ ప్రైజ్ చేశాడు.


అల్లు అర్జున్ లోనూ ఓ మంచి నటుడు ఉన్నాడు అని అందరికీ గుర్తు చేసిన మొదటి సినిమా వేదం అంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది క్రిష్. ఆ క్రిష్ తో ఇప్పుడు ఐకన్ స్టార్ సినిమా చేయబోతున్నాడు అని ఓ కొత్త పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమా కాదా అని చర్చించుకునేందుకు ఆస్కారం కూడా ఇవ్వకుండా పోస్టర్ తో పాటు వాళ్లే.. ఈ సందేహాన్ని కూడా యాడ్ చేశారు. దీంతో మరింత సందిగ్దంగా మారింది.


క్రిష్ కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమా స్టార్ట్ చేశాడు. ఏఎమ్ రత్నం నిర్మాణంలో మొదలైన ఆ సినిమా ఒక రోజు షూటింగ్ మూడు నెలలు వెయిటింగ్అన్నట్టుగా సాగి.. కొన్నాళ్లుగా ఆగిపోయింది. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం పడటం లేదు. దీనికి తోడు క్రిష్ అంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. ఇవన్నీ కలిసి ఈ కొత్త సినిమాకు రూట్ క్లియర్ చేశాయా అనే డౌట్స్ వస్తే కూడా తప్పేం లేదు. మొత్తంగా ఈ సడెన్ అనౌన్స్ మెంట్ తో అభిమానుల్లో కూడా ఓ గందరగోళం ఉంది. మరి ఇది సినిమానా లేక ఇంకేదైనా యాడ్ ఫిల్మ్ లాంటిదా అనేది చూడాలి.

Related Posts