రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ఆలీ

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం సాదారణంగా జరిగేదే. ఈకోవలోనే.. నటుడు ఆలీ పాతికేళ్ల క్రితమే రాజకీయాలకు దగ్గరగా ఉన్నాడు. 1999లో రామానాయుడు కోరిక మేరకు టి.డి.పి. పార్టీలో చేరిన ఆలీ 20 ఏళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగాడు. ఇక.. 2019 ఎన్నికల ముందు ఆలీ వైసిపి పార్టీలో చేరాడు.

వైసిపి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ఆలీకి.. ఎ.పి. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవి కట్టబెట్టింది. వైసిపి లో జాయిన్ అయ్యే సమయంలో ఆలీకి తన చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్ తో కాంట్రవర్శీ అయ్యింది.

ఒకానొక సమయంలో తన మిత్రుడు ఆలీ కూడా తనను అర్థం చేసుకోలేదని పవన్ ఆవేదన చెందాడు. అలాగే.. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం లేదని ఆలీ అందుకు బదులిచ్చాడు.

ప్రస్తుతం ఆలీ వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పేశాడు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఇకపై తాను రాజకీయాలకు దూరమని ప్రకటించిన అలీ.. నటుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇకపై సినీ నటుడిగానే కొనసాగుతానని.. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని స్పష్టం చేశాడు.

Related Posts