డెకాయిట్ గా మారిన హీరో

తెలుగులో వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు అడవి శేష్‌. ఓ రకంగా అతను సెల్ఫ్ మేడ్ స్టార్. తనెవరో ఎవరికీ తెలియని స్టేజ్ నుంచి ఇప్పుడు కంట్రీ మొత్తం ఫేమ్ సంపాదించేంత వరకూ అతని జర్నీ అంతా తను రాసుకున్నదే. మొదట్లో విలన్ వేషాలతో వచ్చిన శేష్‌.. తనే కథ, స్క్రీన్ ప్లే అందించిన క్షణం మూవీతో అందరి అటెన్షన్ సంపాదించాడు.

తర్వాత గూఢచారితో ఇండస్ట్రీని కూడా సర్ ప్రైజ్ చేశాడు. అటుపై ఎవరు, మేజర్ వంటి మూవీస్ తో మెస్మరైజ్ చేస్తూ ఇవాళ తనకంటూ ఓ పెద్ద గుర్తింపును స్వయంగా తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్ గా వచ్చిన హిట్2 మూవీ తర్వాత అతను గ్యాప్ తీసుకున్నాడు.

ఈ గ్యాప్ లో మరోసారి తనదైన శైలిలో ఓ కథ రాసుకున్నాడు. దీనికి కథనం, మాటలు కూడా తనే అట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం చేసే అవకాశాలున్నాయంటున్నారు.


ఇక విశేషం ఏంటంటే.. శేష్‌ టైటిల్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి డెకాయిట్ అనే టైటిల్ అనుకుంటున్నారట. డెకాయిట్ అంటే మోసగాడు అనే కదా అర్థం. మరి ఇప్పటి వరకూ సన్సియర్ రోల్స్ తో మెప్పించిన శేష్‌ ఫస్ట్ టైమ్ దానికి భిన్నమైన టైటిల్ తో రాబోతున్నాడు. మరి కంటెంట్ కూడా అలాగే ఉంటుందా లేక ఇంకేదైనా సర్ ప్రైజ్ చేస్తాడా అనేది తెలియదు కానీ.. దాదాపు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నట్టే అంటున్నారు.


అయితే.. శేష్‌ ఇంతకు ముందు గూఢచారి సీక్వెల్ తీస్తానని చెప్పాడు. హిట్ 2 టైమ్ లో కూడా దానికి సంబంధించిన వర్క్ నడుస్తుందన్నాడు. మరి సడెన్ గా ఈ డెకాయిట్ అవతారం ఏంటో కానీ అసలు గూఢచారికి సీక్వెల్ ఉంటుందా ఉండదా అనేది తేలడం లేదు.

Related Posts