పవన్ సినిమాలకు కూడా 2-పార్ట్స్ స్ట్రాటజీ

ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ఒరవడి ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్ ఇండియా మూవీస్ కి అయితే ఈ పద్ధతిని ఎక్కువగా పాటిస్తున్నారు. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ టూ పార్ట్స్ పాలిసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒకటి కాదు.. పవన్ నటిస్తున్న రెండు సినిమాలు రెండేసి భాగాలుగా రాబోతున్నాయట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోనే ఎంతో ప్రత్యేకమైనది ‘హరిహర వీరమల్లు‘. మొఘలుల కాలం నాటి చారిత్రక అంశాలతో ఫిక్షనల్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నాడు. ‘హరిహర వీరమల్లు‘ బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కాబోతుంది.

‘హరిహర వీరమల్లు‘ కోసం పవన్ మేకోవర్ కూడా చాలా కొత్తగా ఉంది. మొఘలుల కాలాన్ని ప్రతిబించేలా ఈ మూవీకోసం వేసిన భారీ సెట్స్ కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ఎన్నో స్పెషాలిటీస్ తో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు‘ మొదలై చాలాకాలమైనా షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఈ సినిమా కంటే ఆలస్యంగా మొదలైన చిత్రాలకు ముందు ప్రయారిటీ ఇస్తోన్న పవన్ ‘హరిహర వీరమల్లు‘ విషయంలో అశ్రద్ధ వహిస్తున్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఈనేపథ్యంలో లేటెస్ట్ గా ‘హరి హర వీరమల్లు‘ కోసం టూ పార్ట్స్ స్ట్రాటజీని అవలంబించాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇప్పటివరకూ షూటింగ్ పూర్తైన కంటెంట్ ను ఫస్ట్ పార్ట్ గా రిలీజ్ చేసే ప్రణాళికలో ఉన్నారట. అలాగే పవన్ నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ‘ కూడా రెండు పార్ట్స్ గా రాబోతు�