ముంబైలో ‘వార్ 2’ ప్రోమో షూట్

లీడ్ యాక్టర్స్ లేకుండానే ఇటీవల ‘వార్ 2’ మొదలైంది. 12 రోజుల పాటు స్పెయిన్ లో ఓ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించాడు డైరెక్టర్ అయన్ ముఖర్జీ. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బాడీ డబుల్స్ తో ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిందట. ఇక.. డిసెంబర్ నుంచి ‘వార్ 2’ సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు తారక్, హృతిక్.

అయితే.. లేటెస్ట్ గా ‘వార్ 2’కి సంబంధించి ప్రోమో షూట్ ను ముంబైలో మొదలుపెట్టారట. ఈ షూట్ లో హృతిక్ రోషన్ పాల్గొన్నాడట. ఎన్టీఆర్ కూడా పాల్గొంటాడనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటించనుందట. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ లో భాగంగా ‘వార్ 2’ వస్తోంది. ‘పఠాన్, టైగర్ 3’ చిత్రాలకు కొనసాగింపుగా ఈ చిత్రం ఉండనుంది. ఈనేపథ్యంలో షారుఖ్, సల్మాన్ కూడా ‘వార్ 2’లో కేమియోస్ లో మురిపించే ఛాన్సెస్ ఉన్నాయి.

మరోవైపు నటనతో పాటు.. డ్యాన్సెస్, ఫైట్స్ లో దుమ్మురేపే ఇండియన్ యాక్టర్స్ లో హృతిక్, ఎన్టీఆర్ ముందు వరుసలో నిలుస్తారు. అలాంటి ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’పై అటు నార్త్ లోనూ.. ఇటు సౌత్ లోనూ మంచి క్రేజుంది. ఇక.. ఈ మూవీలో తారక్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటివరకూ కనిపించనటువంటి అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడతాడట యంగ్ టైగర్.