ఇంప్రెసివ్ గా ఇంటింటి రామాయణం ట్రైలర్

తెలంగాణ నేపథ్యంలో ఈ మధ్య చాలా కథలు వస్తున్నాయి. అన్ని కథల్లోనూ ఓ జెన్యూనిటీ కనిపిస్తోంది. కొన్ని మాత్రమే గాడి తప్పుతూ మందు, మాంసం అంటూ సాగుతున్నాయి. అయినా ఆ చిత్రాలు కూడ కమర్షియల్ గా ఆకట్టుకోవడం బాక్సాఫీస్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి.

బట్ కొన్ని మాత్రమే రియాలిటీకి దగ్గరగా కనిపిస్తున్నాయి. ఈ కథల్లో ఓ ఆత్మ ఉంటుంది. అలాంటి కథే అనిపించేలా ఉంది ఇంటింటి రామాయణం మూవీ. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి జంటగా నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథలానే ఉంది.


ట్రైలర్ ను బట్టి చూస్తే.. నరేష్‌ కూతురుతో రాహుల్ రామకృష్ణ ప్రేమలో ఉంటాడు. ఈ విషయం వారి ఇళ్లల్లో తెలియదు. జనానికి మాత్ర రాహుల్ అమ్మాయిలంటే భయపడేవాడిలా కనిపిస్తాడు. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం ఉండదు. ఈ క్రమంలోనే నరేష్ ఫ్యామిలీ కొన్ని రోజులు వేరే ఊరికి వెళుతుంది. దీంతో నరేష్ దోస్తులంతా కలిసి ఆ ఇంట్లో రోజూ దావత్ చేసుకుంటరు.

ఈక్రమంలోనే ఇంట్లో బంగారం పోతుంది. మరి ఆ బంగారం దొంగిలించింది ఎవరు..? దీనికి ప్రేమకథకు ఏమైనా లింక్ ఉందా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమా రూపొందినట్టు అర్థమౌతోంది. ఇక జమ్మికుంట పరిసర ప్రాంతానికి చెందిన గ్రామీణ కథగా వస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సమర్పిస్తుండగా వెంకట్ ఉప్పుటూరి – గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు. సురేష్‌ నరెడ్ల దర్శకుడు. మొత్తంగా తెలంగాణ నుంచి మరో ఇంట్రెస్టింగ్ డ్రామా వస్తున్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.