డిజే టిల్లు .. మల్లొస్తుండు

కొన్ని సినిమాలు అలా వెంటాడతాయంతే.. రియాలిటికీ దగ్గరగా.. ప్రాంతీయతలోని వాస్తవికతను స్పష్టంగా చెబుతూ కనిపిస్తాయి. అలాంటి చిత్రమే డిజే టిల్లు. ఈ మూవీకంటే ముందే గుంటూర్ టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింతగాథ వినుమా చిత్రాలతో తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ముఖ్యంగా గుంటూర్ టాకీస్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను వెంట వెంటనే ఫిల్ చేస్తూ తర్వాతి సినిమాలు చేశాడు. అయినా అతనికంటూ ఓ ఇమేజ్ మాత్రం రాలేదు. అలాంటి టైమ్ లో వచ్చిన డిజే టిల్లు.. ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. తెలంగాణ స్లాంగ్ లో సిధ్ధు డైలాగులు, అతని క్యారెక్టరైజేషన్.. రాధిక అంటూ చెప్పిన మాటలూ అన్నీ ఆకట్టుకున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ డిజే టిల్లు చిత్రంలోని డైలాగులు బై హార్డ్ అయిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ఉన్నాయి మాటలు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో విమల్ కృష్‌ణ డైరక్ట్ చేసిన ఈ మూవీ డైలాగ్స్ రాసింది సిద్ధునే కావడం విశేషం.

ప్రతి సీక్వెన్స్ ను హిలేరియస్ గా మలచి రాసిన స్క్రీన్ ప్లే సైతం డిజే టిల్లును బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చేసింది. మరి అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఆసక్తి కనిపిస్తుందో వేరే చెప్పాలా..?యస్.. డిజే టిల్లుకు సీక్వెల్ రాబోతోంది. సినిమా ఎండ్ లో కూడా సీక్వెల్ కు రూట్ వేసుకునే ఎండ్ చేశారు. కాస్త ఆలస్యం అయినా ఈ మూవీకి సీక్వెల్ ను రూపొందించబోతున్నారు. ఈ విషయాన్ని అనఫీషియల్ గా అనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. రీసెంట్ గా ఓపెనింగ్ కూడా జరుపుకుంది అనే టాక్ వినిపించింది. మొత్తంగా డిజే టిల్లు ఎండ్ లో అతనో రష్యన్ అమ్మాయితో కలిసి బయలుదేరతాడు. ఇక్కడ రాధిక అరెస్ట్ అయి జైలులో ఉంటుంది. మరి అసలే కన్నింగ్ అయిన రాధిక ఈ సారి టిల్లును ఇబ్బంది పెడుతుందా లేక తనే మళ్లీ ఇబ్బందుల పాలవుతుందా అనేది చెప్పలేం కానీ.. ఈ సారి సీక్వెల్ పై భారీ అంచనాలు మాత్రం ఉంటాయని చెప్పొచ్చు. సిద్ధు టాలెంట్ అందరికీ తెలుసు కాబట్టి.. వాటిని అందుకోవడం ఏమంత కష్టం కూడా కాదు. సో గెట్ రెడీ ఫర్ సీక్వెల్ ఆఫ్ డిజే టిల్లు..