NTR 30లో రాములమ్మ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా!

RRRతో పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ డ‌మ్ తెచ్చుకున్న టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ ఒక‌రు. ఆ సినిమా విడుద‌లై దాదాపు ఆరు నెల‌ల‌వుతుంది. అయితే ఇంకా తార‌క్ త‌న నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌లేదు. డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్స్ అంతా ఫిక్స్ అయినా మూవీ స్టార్ట్ కాక‌పోవ‌టంతో యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌లో తెలియ‌ని టెన్ష‌న్ పెరిగిపోతుంది. అయితే ఆల‌స్య‌మైనా ప‌ర్లేదు కానీ..

బ్లాక్ బ‌స్ట‌ర్ కంటెంట్‌తోనే రావాల‌ని ఎన్టీఆర్‌, కొరటాల శివ ఫిక్స్ అయిపోయార‌ట‌. స్క్రిప్ట్‌పై కొర‌టాల శివ మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌ర్క్ చేస్తున్నార‌ని కూడా బ‌య‌ట టాక్‌.మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌ను క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో మిక్స్ చేసి సినిమాలు చేయ‌టంలో కొర‌టాల శివ దిట్ట‌. ఆచార్య విష‌యంలో ఆయ‌న ఫెయిల్ అయ్యారే కానీ.. మిగిలిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే ఆ విష‌యం నిజ‌మ‌ని చెప్ప‌క త‌ప్పదు. బ‌లమైన క్యార‌క్ట‌రైజేష‌న్స్ మ‌న‌కు క‌నిపిస్తాయి. ఎన్టీఆర్ సినిమా NTR 30లో ఆయ‌న ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల‌ను క్రియేట్ చేశార‌ట‌. అందులో ఓ పాత్ర కోసం నాటి లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌యశాంతిని సంప్ర‌దించార‌ని స‌మాచారం.

రాజ‌కీయ ప్ర‌వేశం త‌ర్వాత విజ‌యశాంతి సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. చాలా గ్యాప్ త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రులో న‌టించారు. ఇక‌పై చాలా న‌చ్చిన పాత్ర‌లు వ‌స్తే త‌ప్ప‌.. తాను సినిమాలు చేయ‌న‌ని అప్పుడే చెప్పారామె. రీసెంట్‌గా కొర‌టాల శివ‌.. విజ‌యశాంతిని క‌లిసి క‌థ, ఆమె పాత్ర‌ను నెరేట్ చేశార‌ట‌. మ‌రి ఆమె స‌మాధానం ఏంట‌నేది తెలియాల్సి ఉంది.

NTR 30 సినిమా కోసం ఎన్టీఆర్ బ‌రువు త‌గ్గుతున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.